పుదుచ్చేరిలో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్... చెట్టు కింద అసెంబ్లీ సమావేశాల నిర్వహణ

Puducherry MLA tested corona positive
పుదుచ్చేరి శాసనసభలో చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఓ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ రావడంతో అసెంబ్లీ భవనాన్ని ఖాళీ చేశారు. విపక్ష సభ్యుడు ఎన్ఎస్ జే జయబాల్ కు నిన్న కరోనా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. ప్రధాన భవనం మూసివేశారు. దాంతో అసెంబ్లీ సమావేశాలను అదే ప్రాంగణంలో ఉన్న ఓ తోటలో  చెట్టు కింద నిర్వహించాల్సి వచ్చింది. ఇక, ఎమ్మెల్యేకి కరోనా సోకడంతో ఇతర సభ్యులంతా 7 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని పుదుచ్చేరి సీఎం సూచించారు. ఎల్లుండి శాసనసభ్యులందరికీ కరోనా పరీక్షలు చేయిస్తున్నామని ఆయన తెలిపారు. కాగా, పుదుచ్చేరి అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగిశాయి.
Go Back to Shorts
Puducherry Assembly
MLA
Corona Virus
Positive

More Telugu News