Jhanvy Kapoor: నా బ్యాక్ గ్రౌండే నాకు గౌరవాన్ని తెస్తోంది: జాన్వీ కపూర్

Jhanvy Kapoor says she is lucky
  • జాన్వీ తాజా చిత్రం 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్'
  • ఆగస్టు 12న నెట్ ఫ్లిక్స్ ద్వారా డైరెక్టు రిలీజ్
  • ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదన్న జాన్వీ  
సినిమా రంగంలో కొంతమంది మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులేవీ తాను ఎదుర్కోలేదని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక జాన్వీ కపూర్. శ్రీదేవి, బోనీ కపూర్ ముద్దుల తనయగా సినిమా రంగానికి పరిచయమైన ఈ చిన్నది, బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటోంది.

అందం, అభినయాన్ని తల్లి నుంచి వారసత్వంగా పొందిన జాన్వీ తాజాగా 'గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గాళ్' సినిమాలో నటించింది. సుమారు రెండు దశాబ్దాల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధంలో పాలుపంచుకున్న తొలి మహిళా ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ గా రూపొందిన ఈ చిత్రం త్వరలో ఓటీటీ ప్లేయర్ ద్వారా విడుదలవుతోంది. ఇందులో గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ నటించింది.

ఈ నేపథ్యంలో జాన్వీ మీడియాతో మాట్లాడినప్పుడు.. సినిమా రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి, లైంగిక వేధింపుల గురించి అడగడం జరిగింది. దానికి ఆమె స్పందిస్తూ, తాను సినీ బ్యాక్ గ్రౌండ్ వున్న కుటుంబం నుంచి రావడం వల్ల తనకు ఎటువంటి ఇబ్బందులు ఇక్కడ ఎదురుకాలేదని చెప్పింది. తన ఫ్యామిలీ నేపథ్యం మూలంగా తనకు ఇక్కడ అందరూ గౌరవమర్యాదలు ఇస్తారనీ, ప్రోత్సహిస్తారనీ, అందుకు తాను ఎంతో లక్కీ అనిపిస్తుందనీ జాన్వీ చెప్పింది.

ఇక తన తాజా చిత్రం 'గుంజన్ సక్సేనా..' సినిమా గురించి చెబుతూ, 'గుంజన్ నిజ జీవిత కథ విని ఆశ్చర్యపోయాను. ఆమె కథ నన్నెంతో ఇన్ స్పైర్ చేసింది. ఈ కథ మిమ్మల్ని కూడా ఇన్ స్పైర్ చేస్తుందని ఆశిస్తున్నాను' అని చెప్పింది. అన్నట్టు, ఈ చిత్రం ఆగస్టు 12న నెట్ ఫ్లిక్స్ ద్వారా డైరెక్టుగా విడుదలవుతోంది.
Jhanvy Kapoor
Sridevi
Bony Kapoor
Gunjan Saksena

More Telugu News