Pawan Kalyan: కైకాల సత్యనారాయణ గారికి ప్రభుత్వపరంగా ఎలాంటి గుర్తింపు దక్కనందుకు బాధగా ఉంది: పవన్ కల్యాణ్

Pawan Kalyan wants Padmasri for Kaikala Sathyanarayana
  • ఇవాళ కైకాల సత్యనారాయణ పుట్టినరోజు
  • శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్
  • నవరస నటనా శిఖరం అంటూ వ్యాఖ్యలు
నవరస నటనా సార్వభౌముడిగా పేరుగాంచిన టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ జన్మదినం సందర్భంగా జనసేనాని పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. నవరసాలను అలవోకగా పండించగల కైకాల సత్యనారాయణ తెలుగునేలపై జన్మించడం తెలుగువారి అదృష్టం అని పేర్కొన్నారు. తెలుగు చిత్రపరిశ్రమ మద్రాస్ నుంచి హైదరాబాద్ రావడంలో ఆయన కృషి ఎంతో ఉందని తెలిపారు. మద్రాస్ లో ఉన్నప్పటి నుంచే సత్యనారాయణతో తమ కుటుంబానికి అనుబంధం ఉందని, ఎప్పుడు కలిసినా ఎంతో వాత్సల్యంతో మాట్లాడేవారని పవన్ గుర్తు చేసుకున్నారు.

సినీ రంగంలో అంచెలంచెలుగా ఎదిగి అనేకమంది కళాకారులకు ఆదర్శప్రాయుడిగా నిలిచారని కొనియాడారు. అయితే, నటనలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఆయనకు ప్రభుత్వపరంగా ఎలాంటి గుర్తింపు రానందుకు ఎంతో బాధగా ఉందని, తానే కాకుండా ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా ఈ విషయంలో విచారం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కైకాల సత్యనారాయణకు పద్మశ్రీ పురస్కారం ప్రకటించే విధంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కృషి చేయాలని సూచించారు.
Pawan Kalyan
Kaikala Sathyanarayana
Padmasri
Tollywood

More Telugu News