Madhya Pradesh: నాకు కరోనా సోకింది: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ చౌహాన్

  • ట్వీట్ చేసిన శివరాజ్‌ సింగ్‌ 
  • లక్షణాలు కనపడడంతో పరీక్షలు పరీక్షలు చేయించుకున్నా
  • నేను అన్ని నిబంధనలు పాటిస్తున్నాను
  • వైద్యుల సూచనల మేరకు క్వారంటైన్‌లో ఉంటాను
Madhya Pradesh Chief Minister Shivraj Singh Chouhan Tests Coronavirus Positive

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ (61) కు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 'కొవిడ్‌-19 లక్షణాలు కనపడడంతో పరీక్షలు చేయించుకున్నాను. దీంతో కరోనా పాజిటివ్ అని తేలింది. నేను అన్ని నిబంధనలు పాటిస్తున్నాను. వైద్యుల సూచనల మేరకు క్వారంటైన్‌లో ఉంటాను' అని ఆయన హిందీలో ట్వీట్ చేశారు.

తనకు కరోనా సోకిన నేపథ్యంలో తనతో కలిసి పనిచేసిన వారందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని శివరాజ్ సింగ్ కోరారు. మధ్యప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు.

ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కరోనా సోకుతుందని శివరాజ్ సింగ్  చెప్పారు. తాను కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నానని, అయితే, చాలా మంది పలు విషయాలపై తనను కలిసేందుకు వచ్చారని, దీంతో కరోనా సోకి ఉండొచ్చని తెలిపారు.
 
కాగా,  శివరాజ్ సింగ్ చౌహాన్‌కు కరోనా రిపోర్టులు నిన్న మధ్యాహ్నం వచ్చాయి. ఆయనను వైద్య సిబ్బంది భోపాల్‌లోని చిరాయు ఆసుపత్రికి తరలించనున్నట్లు ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ మిశ్రా తెలిపారు.

More Telugu News