హీరో సుశాంత్‌ మృతి కేసు: హీరోయిన్‌ కంగ‌నాను ప్రశ్నించనున్న ముంబై పోలీసులు

25-07-2020 Sat 10:52
  • పలువురు సినీ ప్రముఖులను విచారించిన పోలీసులు
  • బంధుప్రీతి కారణంగానే ఆత్మహత్య అని కంగనా ఆరోపణలు
  • క‌ర‌ణ్ జొహార్‌‌, ఆదిత్య చోప్రాపై విమర్శలు 
police sends summons to kangana

తీవ్ర ఒత్తిడి కారణంగా బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ జరుపుతోన్న పోలీసులు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించారు. ఈ కేసులో హీరోయిన్ కంగ‌నా రనౌత్‌ని కూడా ప్ర‌శ్నించేందుకు ఆమెకి తాజాగా ముంబై పోలీసులు స‌మ‌న్లు జారీ చేశారు.

సుశాంత్ మృతి చెందినప్పటి నుంచి కంగనా రనౌత్‌ బాలీవుడ్‌లో బంధుప్రీతి గురించి వ్యాఖ్యలు చేస్తోన్న విషయం తెలిసిందే. క‌ర‌ణ్ జొహార్‌‌, ఆదిత్య చోప్రా వంటి వారు ఉద్దేశపూర్వకంగానే సుశాంత్ సింగ్‌ కెరీర్‌ని నాశ‌నం చేశార‌ని ఆమె ఆరోపిస్తోంది. ఇప్పటికే ఆదిత్య చోప్రాని కూడా పోలీసులు విచారించారు.

ఈ కేసులో కంగనాను ప్రశ్నించడానికి ఇంతకు ముందు పోలీసులు ప్రయత్నించగా ఆమె మ‌లాలీలో ఉండ‌డంతో విచారణ బృందాన్ని తన వద్దకే పంపి తన స్టేట్ మెంట్ రికార్డ్ చేయాల‌ని కంగనా కోరింది. తాజాగా, మరోసారి ఆమెకు పోలీసులు సమన్లు పంపారు.