Jogulamba Gadwal District: గద్వాలలో విషాదం.. కారుతో పాటు వాగులో కొట్టుకుపోయిన మహిళ

woman who was washed away in the canal along with the car in  Gadwal
  • కర్నూలు నుంచి కారులో బయలుదేరిన కుటుంబం
  • కుటుంబ సభ్యులు కారు దిగగా కారును వాగు దాటించే ప్రయత్నంలో విషాదం
  • అలంపూర్-రాయచూర్ మధ్య  నిలిచిన రాకపోకలు
జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణం జరిగింది. చూస్తుండగానే ఓ మహిళ కారుతో సహా వాగులో కొట్టుకుపోయింది. ఓ కుటుంబం కర్నూలు నుంచి హైదరాబాద్‌కు కారులో బయలుదేరింది. అయితే, గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలోని కలుగొట్ల సమీపంలో రోడ్డుపై నుంచి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.

దీంతో కుటుంబ సభ్యులు కారు దిగగా, డ్రైవింగ్ చేస్తున్న మహిళ కారును ఆవలి ఒడ్డుకు చేర్చే ప్రయత్నంలో కారుతో సహా ఆమె కొట్టుకుపోయింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. కాగా, బొంకూరు వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో రహదారి పూర్తిగా దెబ్బతింది. దీంతో అలంపూర్-రాయచూర్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.
Jogulamba Gadwal District
Kurnool District
Car
Canal

More Telugu News