బ్లాగు రచన ప్రారంభించిన నారా లోకేశ్... దళితులపై దాడులు ఇతివృత్తంగా తొలివ్యాసం

24-07-2020 Fri 20:59
  • 'మీడియం' వేదికపై కాలుమోపిన లోకేశ్
  • స్వయంగా వెల్లడించిన టీడీపీ అగ్రనేత
  • దళితుల ప్రాణాలంటే లెక్కలేదా? అంటూ వ్యాసం
Nara Lokesh starts blog writings on Medium platform

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ బ్లాగు రచనా రంగంలో ప్రవేశించారు. 'మీడియం' అనే బ్లాగు హోస్టింగ్ ప్లాట్ ఫామ్ పై అడుగుపెట్టారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. "ఇప్పుడు నేను 'మీడియం' వేదికపై ఉన్నానని చెప్పడానికి సంతోషిస్తున్నా. నా తొలి వ్యాసం కూడా రాసేశాను. ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో దళితులపై జరుగుతున్న దాడులపై నా వ్యాసం రాశాను" అని వివరించారు. దళితుల ప్రాణాలంటే ఈ ప్రభుత్వానికి లెక్కలేదా? అంటూ సాగిన లోకేశ్ వ్యాసంలో ఇటీవల ఘటనలతో పాటు గతంలో ఎలా ఉండేదన్న వివరాలు కూడా పంచుకున్నారు.