Kanna Lakshminarayana: భార్య మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ కుమారుడు

Kanna Lakshminarayanas son expresses doubts on hes wifes death
  • సీబీఐటీ వద్ద నా భార్య చనిపోయిందని తొలుత చెప్పారు
  • స్థలం గురించి అబద్ధాలు చెప్పడం వల్లే నాకు అనుమానాలు కలుగుతున్నాయి
  • నా భార్యకు చెడు అలవాట్లు లేవు
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా తన భార్య మృతిపై కన్నా కుమారుడు ఫణీంద్ర అనుమానాలు వ్యక్తం చేశారు. పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ సైబరాబాద్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. తన భార్యకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెప్పారు.

ఆమె చనిపోయిన రోజున డ్రగ్ పార్టీ జరిగిందని, ఆ పార్టీలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నారని, వారంతా ఘటనా స్థలం నుంచి పారిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. సీబీఐటీ వద్ద ఉన్న ఫాంహౌస్ లో తన భార్య చనిపోయిందంటూ తొలుత వారు చెప్పారని, ఆ తర్వాత మాట మార్చారని చెప్పారు. తన భార్యది ఆత్మహత్యా లేక హత్యా అనే విషయాన్ని తేల్చాలని పోలీసులను ఆయన కోరారు.

తన తోడల్లుడితో తమకు ఆర్థిక వివాదాలు ఉన్నాయని ఫణీంద్ర తెలిపారు. ఆరోజు పార్టీలో పాల్గొన్న వారంతా తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. సీబీఐటి వద్ద ఆమె చనిపోయిందని వారు చెప్పారని... ఆ తర్వాత మీనాక్షి మ్యాన్షన్ లో జరిగిందని రాయదుర్గం సీఐ దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. స్థలం గురించి అబద్దాలు చెప్పడం వల్లే తనకు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. తన భార్య చనిపోయిన రోజు జరిగింది పార్టీ కాదని... తమ మధ్య ఉన్న ప్రాపర్టీ వివాదాలపై మాట్లాడటానికి ఆమె వెళ్లిందని తెలిపారు.
Kanna Lakshminarayana
Daughter in Law
Son
Death

More Telugu News