YS Vivekananda Reddy: వైయస్ వివేకా మర్డర్ కేసు.. టెక్నికల్ టీమ్ ని రంగంలోకి దించిన సీబీఐ! 

CBI probe speed up in YS Vivekananda murder case
  • వివేకా హత్య కేసు విచారణను వేగవంతం చేసిన సీబీఐ
  • కాల్ డేటాను విశ్లేషించనున్న టెక్నికల్ టీమ్
  • అనుమానితులను పూర్తి స్థాయిలో విచారించే అవకాశం
మాజీ మంత్రి వైయస్ వివేకానంద హత్య కేసు విచారణ వేగం అందుకుంది. రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు విచారణను వేగవంతం చేశారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ, సిట్ అధికారులు, పులివెందుల డీఎస్పీని అధికారులు కలిశారు. వీరి నుంచి పలు విషయాలను సేకరించడమే కాక... ఇప్పటి వరకు విచారించిన డాక్యుమెంట్లను తీసుకున్నారు.

తాజాగా టెక్నికల్ టీమ్ ను కూడా రంగంలోకి దించారు. వివేకాతో పాటు ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న వారి కాల్ డేటాను విశ్లేషించనున్నారు. ఎస్ఎంఎస్ ల రూపంలో ఏదైనా సమాచారం పంపారా? అనే విషయాలను కూడా టెక్నికల్ టీమ్ పరిశీలించనుంది.

మరోవైపు వివేకా ఇంటి వాచ్ మెన్ రంగన్నను సీబీఐ అధికారులు విచారించారు. మిగిలిన అనుమానితులను కూడా పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.  
YS Vivekananda Reddy
Murder Case
CBI

More Telugu News