Kalvakuntla Kavitha: చిన్నప్పటి కేటీఆర్, కవిత... ఇదిగో ఇలా ఉన్నారు!

Kavitha tweets her childhood photo along with her brother KTR
  • ఇవాళ కేటీఆర్ పుట్టినరోజు
  • అన్నయ్యకు విషెస్ తెలిపిన కవిత
  • నీ పుట్టినరోజంటే నాకు చాలా సంతోషం అంటూ ట్వీట్
తెలంగాణ ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ పై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత కూడా తన సోదరుడికి బర్త్ డే విషెస్ తెలిపారు.

"మనం తోబుట్టువులను కానీ, ఇరుగుపొరుగును కానీ ముందే ఎంపిక చేసుకోలేమన్నది ఓ నానుడి. కానీ నన్నో చిట్టి చెల్లెలుగా నీవు కలిగివుండడం ఎంత అదృష్టమో నేను నమ్మలేకపోతున్నాను. ఏదేమైనా నీ పుట్టినరోజంటే నాకు చాలా సంతోషం. నీలా రాక్ స్టార్ వంటి అన్నయ్య నాకుండడం చూస్తుంటే ఎంతో గొప్పగా అనిపిస్తోంది. హ్యాపీ బర్త్ డే అన్నయ్యా!" అంటూ కవిత ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా కవిత తాను బాల్యంలో అన్న కేటీఆర్ తో కలిసి ఉన్నప్పటి ఫొటోను కూడా పంచుకున్నారు.
Kalvakuntla Kavitha
KTR
Photo
TRS
Telangana

More Telugu News