చంద్రబాబునాయుడి కాళ్లపై పడినప్పుడే హర్షకుమార్ విలువ దిగజారింది: పినిపే విశ్వరూప్

24-07-2020 Fri 14:35
  • ఏపీలో దళితులపై దాడులు
  • ప్రభుత్వంపై అనుమానంగా ఉందన్న హర్షకుమార్
  • హర్షకుమార్ నోరు అదుపులో ఉంచుకోవాలన్న విశ్వరూప్
Pinipe Viswaroop slams Harasha Kumar

ఏపీలో వరుసగా దళితులపై దాడులు జరగడం చూస్తుంటే ప్రభుత్వంపై అనుమానాలు కలిగే పరిస్థితి ఏర్పడిందని మాజీ ఎంపీ హర్షకుమార్ వ్యాఖ్యలు చేయగా, దీనిపై మంత్రి పినిపే విశ్వరూప్ ఘాటుగా స్పందించారు. చంద్రబాబునాయుడి కాళ్లమీద పడినప్పుడే హర్షకుమార్ విలువ దిగజారిందని అన్నారు.

 దళిత పులి అని చెప్పుకునే హర్షకుమార్ తన రాజకీయ భవిష్యత్తు కోసం జాతిని ఎంతకైనా తాకట్టు పెడతారని విమర్శించారు. హర్షకుమార్ నాలుకను అదుపులో ఉంచుకుని మాట్లాడాలని, ఇకనైనా దిగజారుడు రాజకీయాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు. సీఎం జగన్ దళితులకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తున్నారని, దళితుడు వరప్రసాద్ కేసులో వెంటనే స్పందించి చర్యలు తీసుకున్నారని తెలిపారు.