Vikas Dubey: గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే గురించి ఆసక్తికర అంశం వెల్లడించిన భార్య

Wife reveals Vikas Dubey mental situation in recent times
  • కొన్నాళ్ల కిందట వికాస్ దూబేకు ప్రమాదం
  • మెదడులో సమస్య ఏర్పడిందన్న భార్య
  • కోపంగా, ఆందోళనగా కనిపించేవాడని వెల్లడి
ఉత్తరప్రదేశ్ లో ఎనిమిది మంది పోలీసుల మరణానికి కారకుడై, చివరికి పోలీసుల చేతిలోనే హతుడైన గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే గురించి భార్య రిచా దూబే స్పందించింది. కొంతకాలం కిందట వికాస్ ఓ ప్రమాదానికి గురయ్యాడని, ఆ ప్రమాదం కారణంగా అతడి మెదడులో  సమస్య ఏర్పడిందని వివరించింది. అప్పటి నుంచి ఎంతో కోపంగా, ఆందోళనగా కనిపించేవాడని, ఈ లక్షణాలు తగ్గేందుకు చికిత్స కూడా తీసుకున్నాడని తెలిపింది. కాగా, గత నాలుగు నెలల నుంచి ఈ ట్రీట్ మెంట్ ఆగిపోవడంతో వికాస్ లో మళ్లీ కోపం పెరిగిపోయిందని రిచా వెల్లడించింది.

"ఒకరోజు వేకువజామున తనకు ఫోన్ చేసి, పోలీసులపై దాడి జరుగుతోందని, పిల్లలను తీసుకుని భిక్రూ గ్రామం నుంచి ఎటైనా వెళ్లిపోవాలని కోరాడు. ఇలాంటి వ్యవహారాలతో విసిగిపోయి ఉన్నానని చెప్పి ఫోన్ పెట్టేశాను. నాకు వికాస్ చేసే పనుల గురించి, అతడి ఫ్రెండ్స్ గురించి తెలిసింది చాలా తక్కువ. ఎనిమిది మంది పోలీసులను చంపాడని తెలిసిన తర్వాత అతడ్ని చంపేయాలన్నంత ఆవేశం కలిగింది. ఈ దారుణాలను ఎప్పటికీ క్షమించలేం. బయట మా ముఖం కూడా చూపించలేకపోతున్నాం" అంటూ రిచా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
Vikas Dubey
Richa
Gangster
Kanpur
Uttar Pradesh

More Telugu News