America: హ్యూస్టన్‌లో చైనా రాయబార కార్యాలయం మూసివేత.. ప్రతీకార చర్యలు చేపట్టిన డ్రాగన్ కంట్రీ

china says it revoked license for the us consulate in chengdu
  • చెంగ్డూలోని అమెరికా దౌత్యకార్యాలయ నిర్వహణ అనుమతులు వెనక్కి
  • అమెరికా అన్యాయమైన చర్యలకు ప్రతిస్పందనేనన్న చైనా
  • ప్రస్తుత పరిస్థితికి ముమ్మాటికి అమెరికాదే బాధ్యతన్న డ్రాగన్ కంట్రీ
హ్యూస్టన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేయించిన అమెరికాపై చైనా ప్రతీకార చర్యలకు దిగింది. చెంగ్డూలోని అమెరికా రాయబార కార్యాలయ నిర్వహణకు ఉన్న అనుమతిని ఉపసంహరిస్తూ ఆ విషయాన్ని అమెరికా అధికారులకు తెలియజేసింది. అంతేకాదు, ఈ నిర్ణయం వెనకున్న కారణాన్ని కూడా వివరించింది.

 అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధంగా హ్యూస్టన్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని మూసివేయాలంటూ అమెరికా రెచ్చగొట్టిందని చైనా ఆరోపించింది. అమెరికా తీసుకున్న అన్యాయమైన చర్యలకు ప్రతిస్పందనగా చెంగ్డూలోని అమెరికా దౌత్య కార్యాలయ నిర్వహణకు ఇచ్చిన అనుమతిని వెనక్కి తీసుకున్నట్టు వివరించింది.

తమ నిర్ణయం మాత్రం అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉందని చెప్పుకొచ్చింది. అమెరికాతో ఇలాంటి పరిస్థితులను తామెప్పుడూ కోరుకోలేదని, ప్రస్తుత ఈ పరిస్థితికి అమెరికాదే బాధ్యత అని నిందించింది. అమెరికా తన తప్పుడు నిర్ణయాలను వెనక్కి తీసుకుని ఇరు దేశాల మధ్య తిరిగి స్నేహపూర్వక వాతావరణం నెలకొనేలా చర్యలు చేపట్టాలని చైనా కోరింది.
America
China
houston
chengdu
american consulate

More Telugu News