Nimmagadda Ramesh: నిమ్మగడ్డ కేసు.. సుప్రీంకోర్టులో జగన్ ప్రభుత్వానికి మరోసారి చుక్కెదురు

Supreme Court denies YSRCP govt request to give stay on Nimmagadda case
  • కోర్టు ధిక్కరణ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ప్రభుత్వం
  • హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశం
  • నిమ్మగడ్డను విధుల్లోకి తీసుకోవాలని ఇప్పటికే గవర్నర్ ఆదేశం

జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో కోర్టు ధిక్కరణ ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్ నేడు విచారణకు రాగా, స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందేనంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వైసీపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైకోర్టు సూచన మేరకు నిమ్మగడ్డ గవర్నర్ ను కలిసి విజ్ఞాపన అందజేయగా, దానిని పరిశీలించిన మీదట, ఆయనను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టులో ఈ కేసు ఉందని... సుప్రీం తీర్పు కోసం తాము వేచి చూస్తున్నామని వైసీపీ నేతలు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో, ఏపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News