Ladakh: లడఖ్ ప్రాంతానికి వరాలు ప్రకటించిన నరేంద్ర మోదీ!

  • కొత్తగా కేంద్ర విశ్వవిద్యాలయం
  • బౌద్ధ అధ్యయన కేంద్రం కూడా
  • లడఖ్ ఏర్పడి ఏడాదైన సందర్భంగా నిర్ణయాలు
Modi Sanction Central University for Ladakh

జమ్మూ కాశ్మీర్ కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు తరువాత, లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఆ ప్రాంతానికి ప్రధాని నరేంద్ర మోదీ వరాలను ప్రకటించారు. లడఖ్ లో తొలి కేంద్ర విశ్వవిద్యాలయం ఏర్పాటుకు మోదీ పచ్చజెండా ఊపారు.

ఇదే సమయంలో ఓ బౌద్ధ అధ్యయన కేంద్రం ఏర్పాటుకు కూడా మోదీ ఓకే చెప్పారు. ఈ యూనివర్శిటీలో ఇంజనీరింగ్, మెడిసిన్ మినహా మిగతా అన్ని బేసిక్ సైన్సెస్ తదితర కోర్సుల్లో డిగ్రీలను అందిస్తుంది. ఇక ఈ వర్శిటీ ఏర్పాటుపై కేంద్ర మానవ వనరుల శాఖ త్వరలోనే అఫీషియల్ గా ప్రపోజల్ తెస్తుందని, ఆపై క్యాబినెట్ ఆమోదం తరువాత బిల్లు పార్లమెంట్ మందుకు వస్తుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కాగా, లడఖ్ ప్రాంతంలో గడచిన ఏడాది కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ప్రధాని, ఈ సమావేశంలోనే కొత్త వర్శిటీపై నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి హోమ్ శాఖ మంత్రి అమిత్ షాతో పాటు విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News