Kurnool District: కర్నూలు జిల్లా పెరవలిలో రైతుకు లభించిన 2 క్యారెట్ల వజ్రం

Farmer found 2 carat diamond in kurnool dist
  • రూ. 1.50 లక్షలకు సొంతం చేసుకున్న వ్యాపారి
  • మరో ముగ్గురికి కూడా లభించిన వజ్రాలు దొరికినట్టు ప్రచారం
  • వర్షాకాలంలో వజ్రాల వేట
కర్నూలు జిల్లాలో ఓ రైతుకు వజ్రం లభించింది. మద్దికెర మండలం పెరవలిలో నిన్న రైతుకు దొరికిన ఈ వజ్రం బరువు 2 క్యారెట్లు ఉంది. ఈ వజ్రాన్ని ఆ రైతు వేలం వేయగా గుత్తికి చెందిన వ్యాపారి ఒకరు లక్షన్నర రూపాయలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు, మద్దికెర మండలంలోని మదనాంతపురం గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు పనుల కోసం తుగ్గలి మండలంలోని ఎద్దులదొడ్డికి వెళ్తుండగా వారిలో ముగ్గురికి వజ్రాలు దొరికినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంలో మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వజ్రాలు బయటపడడం సాధారణమైన విషయమే. చాలామంది ఈ కాలంలో వజ్రాల కోసం పొలాల్లో వేట మొదలుపెడతారు.
Kurnool District
Peravali
Diamond
Farmer

More Telugu News