China: చైనా తీరుపై ప్రపంచ దేశాలు జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి: అమెరికా విదేశాంగ మంత్రి పాంపియో

Mike Pompeo charts out new approach towards dealing with China
  • ప్రపంచ దేశాలతో చైనా వ్యవహరిస్తోన్న తీరు సరికాదు
  • అమెరికా సహా మిత్రదేశాలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి
  • డ్రాగన్ సైన్యం దుందుడుకు చర్యలకు పాల్పడుతోంది
  • ప్రపంచ దేశాల ప్రజలకు ముప్పు
ప్రపంచ దేశాలతో చైనా వ్యవహరిస్తోన్న తీరుపై అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో మండిపడ్డారు. చైనా వ్యవహారంలో అమెరికా సహా మిత్రదేశాలు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని చెప్పారు. చైనా కమ్యూనిస్ట్‌ పార్టీ తన తీరును మార్చుకునేలా చేయడమే ప్రస్తుతం ప్రపంచం ముందున్న విషయమని తెలిపారు.

డ్రాగన్ సైన్యం దుందుడుకు చర్యలకు పాల్పడుతోందని మైక్‌ పాంపియో చెప్పారు. ప్రపంచ దేశాల విధానాలు డ్రాగన్ దేశ ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి సహకరిస్తున్నాయని, అయితే తనకు ఉపయోగపడుతున్న దేశాల పట్ల కూడా చైనా ప్రతికూల ధోరణితో ముందుకు వెళ్తోందని ఆయన విమర్శించారు. చైనా పాల్పడుతున్న చర్యలు ప్రపంచ దేశాల ప్రజలకు, అర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సమయంలో స్వేచ్ఛను కోరుకునే దేశాలు చైనా తీరు మారేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని పిలుపు ఇచ్చారు.
China
USA

More Telugu News