సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

24-07-2020 Fri 07:35
  • సాయి పల్లవి ఎదురుచూస్తున్న పాత్ర 
  • హిట్ దర్శకుడి క్యాంపస్ లవ్ స్టోరీ
  • దీపికకు భారీ మొత్తంలో పారితోషికం
Sai Pallavi wants to do a dance oriented film

*  కథానాయిక సాయిపల్లవి మంచి డ్యాన్సర్ అన్న విషయం మనకు తెలుసు. అయితే, తనలోని డ్యాన్సర్ ని పూర్తిగా బయటకుతెచ్చే పాత్రలేవీ తనకు రావడం లేదని ఈ చిన్నది వాపోతోంది. అందుకే, పూర్తి డ్యాన్స్ ప్రధానమైన పాత్రతో సాగే సినిమా కోసం ఎదురుచూస్తోందట. అటువంటి ఆఫర్ ఏ భాష నుంచి వచ్చినా చేయడానికి ఆమె సిద్ధంగా వుందట. మరి ఆమె కల నెరవేరుతుందేమో చూడాలి!
*  హీరో నాని నిర్మించిన 'హిట్' చిత్రంతో విజయాన్ని సాధించిన దర్శకుడు శైలేష్ కోనేరు తన తదుపరి చిత్రాన్ని క్యాంపస్ లవ్ స్టోరీతో చేయడానికి రెడీ అవుతున్నాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ పనిచేస్తున్నాడు. మరోపక్క, 'హిట్' చిత్రాన్ని హిందీలో రాజ్ కుమార్ రావు హీరోగా శైలేష్ దర్శకత్వంలోనే రీమేక్ చేయనున్నారు.
*  ప్రభాస్ నటించే 21వ చిత్రంలో బాలీవుడ్ భామ దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడీ చిత్రానికి ఆమె 20  కోట్ల భారీ పారితోషికాన్ని తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా ఇది తెరకెక్కనుంది.