Puri Jagannadh: అనుష్కను చూడగానే చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని నాగార్జున చెప్పారు: పూరీ జగన్నాథ్

Puri Jagannath says Nagarjuna expected Anushka rise in industry
  • 'సూపర్' సినిమాకు 15 ఏళ్లు
  • అనుష్కను చూస్తే గర్వంగా ఉందన్న పూరీ
  • విజయసోపానాలు అధిరోహించిందని వెల్లడి
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున, అనుష్క, ఆయేషా టకియా, సోనూ సూద్ నటించిన చిత్రం 'సూపర్'.  ఈ సినిమా వచ్చి 15 ఏళ్లయిన సందర్భంగా దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఈ అమ్మాయిని చూడగానే చాలా పెద్ద హీరోయిన్ అవుతుందని నాగార్జున చెప్పారు అంటూ ట్వీట్ చేశారు.

 'సూపర్' చిత్రంతో అనుష్క వెండితెరకు పరిచయం అయిందని, అప్పటి నుంచి ఇప్పటి 'నిశ్శబ్దం' సినిమా వరకు ఎన్నో విజయసోపానాలు అధిరోహించిందని, ఇప్పుడీ స్థాయిలో ఉన్న అనుష్కని చూస్తుంటే ఎంతో గర్వంగా ఉందని తెలిపారు. హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధానపాత్రలో రూపుదిద్దుకున్న 'నిశ్శబ్దం' వచ్చే నెలలో ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది.
Puri Jagannadh
Anushka Shetty
Nagarjuna
Super
Nishabdam
Tollywood

More Telugu News