Telangana: తెలంగాణలో కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైంది.. జాగ్రత్తగా వుండాలి!: హెల్త్ డైరెక్టర్ సంచలన ప్రకటన

Corona virus community spread started in Telangana
  • తెలంగాణలో ద్వితీయ శ్రేణి నగరాల్లో పెరుగుతున్న కరోనా కేసులు
  • నాలుగైదు వారాలు క్లిష్టంగా ఉంటుందన్న హెల్త్ డైరెక్టర్
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక
తెలంగాణలో కరోనా విస్తరణ కమ్యూనిటీ వ్యాప్తి స్థాయికి వెళ్లిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సంచలన ప్రకటన చేసింది. హైదరాబాదులో కేసుల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ... ద్వితీయ శ్రేణి నగరాల్లో వైరస్ విస్తరిస్తోందని హెల్త్ డైరెక్టర్ చెప్పారు. ప్రస్తుతం కరోనా వైరస్ కమ్యూనిటీ వ్యాప్తి దశకు చేరుకుందని చెప్పారు.

ఈ నేపథ్యంలో ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పరిస్థితి ఉందని చెప్పారు. వైద్య సిబ్బంది కూడా చాలా ఒత్తిడిలో ఉన్నారని తెలిపారు. రానున్న నాలుగైదు వారాలు చాలా క్లిష్టంగా ఉంటాయని చెప్పారు. కరోనా లక్షణాలు ఉంటేనే టెస్టులు చేయించుకోవాలని కోరారు. కరోనా పేషెంట్లకు వెంటనే చికిత్స చేస్తే మంచిదని తెలిపారు.
Telangana
Corona Virus
Community Spread

More Telugu News