Chiranjeevi: మీసం లేకుండా మెగాస్టార్.. క్లారిటీ ఇచ్చిన చిరు!

Chiranjeevi gives clarity about his new look without moustache
  • రెండు మూడు రోజుల నుంచి క్లీన్ షేవ్ తో చిరంజీవి 
  • 'ఆచార్య' సినిమా కోసమంటూ ప్రచారం
  • జస్ట్.. సరదా కోసమే అంటున్న మెగాస్టార్
మొదటి నుంచీ కూడా చిరంజీవి తన లుక్ విషయంలో కానీ, స్టయిల్ విషయంలో కానీ ఎంతో కేర్ తీసుకుంటూవుంటారు. ఆయన సినిమాలను బాగా పరిశీలిస్తే మనకీ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఇదిలావుంచితే, గత రెండు మూడు రోజుల నుంచి వైరల్ అవుతున్న చిరంజీవి కొత్త ఫొటోలు చూసిన వాళ్లు ఆయన మేకోవర్ చూసి ఆశ్చర్యపోతున్నారు.

మీసం లేకుండా.. క్లీన్ షేవ్ తో.. కుర్రాడిలా మెరుస్తున్న ఆయన ఫొటోలు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న 'ఆచార్య' చిత్రం కోసం ఆయనీ కొత్త గెటప్ లో కనిపిస్తున్నారని కూడా సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతోంది.

ఈ నేపథ్యంలో దీనిపై మెగాస్టార్ తాజాగా స్పందించారు. 'ఇందులో ఏం విశేషం లేదు.. ఏదో సరదా కోసం మీసం తీసేశానంతే.. అంతేకానీ, ఈ లుక్ సినిమా కోసం మాత్రం కాదు" అంటూ క్లారిటీ ఇచ్చారు చిరంజీవి. దీంతో అభిమానుల డౌటు తీరిపోయింది.      
Chiranjeevi
Makeover
Acharya
Koratala Siva

More Telugu News