మళ్లీ లాభాల బాట పట్టిన మార్కెట్లు

23-07-2020 Thu 15:59
  • 269 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
  • 83 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • మూడు శాతానికి పైగా లాభపడ్డ ఎస్బీఐ
Sensex closes 269 points high

ఐదు రోజుల లాభాలకు బ్రేకిస్తూ నిన్న నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు... ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. కీలకమైన సంస్థలు త్రైమాసిక ఫలితాలను ప్రకటించనున్న నేపథ్యంలో మార్కెట్లు పాజిటివ్ గా కొనసాగాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 269 పాయింట్లు లాభపడి 38,140కి పెరిగింది. నిఫ్టీ 83 పాయింట్లు పుంజుకుని 11,215కి చేరుకుంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (3.28%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.94%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.82%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (2.14%), ఐటీసీ (2.09%).

టాప్ లూజర్స్:
యాక్సిస్ బ్యాంక్ (-3.80%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.57%), ఇన్ఫోసిస్ (-1.15%), టీసీఎస్ (-0.88%), ఎల్ అండ్ టీ (-0.50%).