జపాన్‌ థియేటర్లలో విడుదలై.. రికార్డు సృష్టించిన ప్రభాస్ సినిమా 'సాహో'!

23-07-2020 Thu 11:10
  • జపాన్‌లో తెరుచుకున్న థియేటర్లు
  • తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన 'సాహో'
  • ఇంతకు ముందు 'దంగల్' పేరిట ఉన్న రికార్డు  
saaho records in japan

బాహుబలి వంటి సూపర్ హిట్‌ సినిమా తర్వాత ప్రభాస్ నటించిన సాహో సినిమాకు భారత్‌లో అంతగా ఆదరణ దక్కలేదు. అయితే, ఈ సినిమాకు ప్రస్తుతం జపాన్‌లో కలెక్షన్ల వర్షం కురుస్తోంది. కరోనాను జపాన్‌ సమర్థంగా కట్టడి చేయడంతో, ఇటీవలే ఆ దేశంలో సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి.

చాలా రోజుల తర్వాత థియేటర్లు తెరుచుకోవడంతో అక్కడి ప్రజలు సినిమాలు చూసేందుకు థియేటర్లకు క్యూకడుతున్నారు. నిజానికి సాహో సినిమా జపాన్‌లో ఈ ఏడాది జనవరిలోనే  విడుదలైనప్పటికీ, ఆ వెంటనే అక్కడ కరోనా కేసులు వెలుగు చూడడంతో  థియేటర్లు మూసేశారు. ఇప్పుడు థియేటర్లు తెరుచుకోవడంతో మరోసారి ఈ సినిమాను విడుదల చేశారు.

జపాన్‌లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమాగా 'సాహో' రికార్డు సృష్టించింది. ఇంతకు ముందు వరకు ఆ రికార్డు బాలీవుడ్ సినిమా 'దంగల్' పేరిట ఉండేది. కాగా, జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి ఐదు  భారతీయ సినిమాల జాబితాలోనూ 'సాహో' నిలిచింది.