Ayodhya Ram Mandir: అలా చేయగానే దేశంలో క‌రోనా మాయమవుతుంది!: బీజేపీ నేత రామేశ్వర్ శర్మ వ్యాఖ్యలు

Construction of Ram Mandir in Ayodhya Will End Coronavirus in India
  • త్వరలో అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి భూమిపూజ
  • నిర్మాణం ప్రారంభమైతే భారత్‌లో కొవిడ్‌-19 వైర‌స్ పోతుంది
  • అప్పట్లో రాక్ష‌సుల‌ను అంతమొందించేందుకు రామావతారం
  • సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం రామాలయ నిర్మాణం
అయోధ్య‌లో రామాల‌య నిర్మాణానికి త్వరలోనే భూమి పూజ చేయనున్న విషయం తెలిసిందే. మరోవైపు దేశంలో కరోనా విజృంభణ అసాధారణ రీతిలో ఉంది. ఈ నేపథ్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్రోటెమ్ స్పీక‌ర్, బీజేపీ నేత రామేశ్వ‌ర్ శ‌ర్మ వింత వ్యాఖ్యలు చేశారు. రామాలయ నిర్మాణం ప్రారంభమైతే భారత్‌లో కొవిడ్‌-19 వైర‌స్ పోతుందని చెప్పారు. శ్రీరామచంద్ర ప్రభువు త్రేతాయుగంలో ప్ర‌జా సంక్షేమం కోసమే రాక్ష‌సుల‌ను అంతమొందించేందుకు అవ‌త‌రించాడ‌ని ఆయన అన్నారు.

ఇప్పుడు అయోధ్య‌లో రాముడి ఆల‌య నిర్మాణం ప్రారంభమైన మరుక్ష‌ణం నుంచే కరోనా పోవడం ప్రారంభమవుతుందని  రామేశ్వ‌ర్ శ‌ర్మ చెప్పారు. మన దేశంలోనే కాకుండా, ప్ర‌పంచం మొత్తం కరోనాతో సమస్యలు ఎదుర్కొంటోందని, ప్రస్తుతం అందరం భౌతిక దూరం పాటిస్తూ దైవ నామస్మరణ చేస్తున్నామని తెలిపారు. అయోధ్యలో సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం రామాలయాన్ని నిర్మిస్తున్నారని చెప్పారు.
Ayodhya Ram Mandir
BJP
India
Corona Virus

More Telugu News