మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై దురుసు ప్రవర్తన... సినీ నటి రాధా ప్రశాంతిపై కేసు!

23-07-2020 Thu 10:02
  • బంజారాహిల్స్ లో బిల్డింగ్ సెక్యూరిటీ మహిళపై దాడి 
  • వీడీయో తీస్తుంటే మహిళా టెక్కీపై దురుసు ప్రవర్తన 
  • కేసు దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
Police Case on Actress Radha Prashanthi

తనపై సినీ నటి రాధా ప్రశాంతి దురుసుగా ప్రవర్తించారంటూ, ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ హైదరాబాద్, బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించడంతో, కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే, ఇక్కడి ఓ భవనంలో బిల్డింగ్ సెక్యూరిటీగా లక్ష్మి అనే మహిళ పని చేస్తోంది.

ఉన్నట్టుండి నిన్న రాత్రి ఆ పక్కనే ఉంటున్న మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు పెద్ద శబ్దం వినిపించగా, ఆమె బయటకు వచ్చి చూసింది. ఆ సమయంలో లక్ష్మిని రాధా ప్రశాంతి కారు ఢీకొట్టింది. ఆపై ఆమె, ఆమెతో పాటు వున్న మరో వ్యక్తి లక్ష్మిపై దాడి చేస్తున్నారు. ఈ ఘటనను చూసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తన మొబైల్ ఫోన్ లో ఆ దృశ్యాన్ని చిత్రీకరించారు. దీన్ని గమనించిన రాధా ప్రశాంతి, తీవ్ర ఆగ్రహంతో ఆమెపై దురుసుగా ప్రవర్తించి, సెల్ ఫోన్ లాక్కుని దాన్ని ధ్వంసం చేసింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించి, ఆమెపై ఫిర్యాదు చేసింది.