India: దేశంలో మరింత ఉద్ధృతమైన కరోనా.. ఒక్కరోజులో ఏకంగా 45,720 కేసులు.. 1,129 మంది మృతి

India for the first time reports more than 45000 new cases
  • మొత్తం కేసులు 12,38,635
  • మృతుల సంఖ్య మొత్తం 29,861
  • 4,26,167 మందికి ఆసుపత్రుల్లో చికిత్స
  • కోలుకున్న వారు 7,82,606 మంది  
భారత్‌లో కరోనా మరింత ఉద్ధృతమైంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం... గత 24 గంటల్లో భారత్‌లో 45,720 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇంత పెద్ద మొత్తంలో కరోనా కేసులు నిర్ధారణ కావడం ఇదే తొలిసారి. అదే సమయంలో 1,129  మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
     
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 12,38,635కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 29,861కి పెరిగింది. 4,26,167 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 7,82,606  మంది కోలుకున్నారు.

కాగా, నిన్నటి వరకు దేశంలో మొత్తం 1,50,75,369 శాంపిళ్లను పరీక్షించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులో  3,50,823  శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
India
Corona Virus
COVID-19

More Telugu News