Anushka Shetty: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

Anushka thanks her fans for their love and support
  • అభిమానులకి థ్యాంక్స్ చెప్పిన అనుష్క 
  • బన్నీ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న కొరటాల
  • వెబ్ సీరీస్ నిర్మాణంలో సుకుమార్
*  కథానాయిక అనుష్క సినిమాలలోకి వచ్చి నేటితో సరిగ్గా 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా స్వీటీ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ఇన్నాళ్లుగా తనను ఆదరిస్తున్న అభిమానులకు సోషల్ మీడియా ద్వారా థ్యాంక్స్ చెప్పింది. అభిమానులందరూ ఈ విపత్కర సమయంలో జాగ్రత్తలు తీసుకుంటూ క్షేమంగా వుండాలని ఆకాంక్షించింది.
*  ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' చిత్రాన్ని చేస్తున్న అల్లు అర్జున్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇందుకు సంబంధించి ఇటీవల వీరిద్దరూ కలసి చర్చించడం జరిగిందని సమాచారం. 'ఆచార్య' షూటింగ్ కి గ్యాప్ రావడంతో కొరటాల ప్రస్తుతం బన్నీ సినిమా స్క్రిప్ట్ పనిచేస్తున్నాడట.
*  ప్రముఖ దర్శకుడు సుకుమార్ కూడా వెబ్ సీరీస్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. 'ఆహా' ఓటీటీ కోసం తొమ్మిది విభిన్న ప్రేమకథల్ని వెబ్ సీరీస్ గా రూపొందించడానికి ఆయన ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటిలో దేనికైనా ఆయన దర్శకత్వం వహిస్తాడా? లేక వేరే వారికి అప్పగిస్తాడా? అన్నది ఇంకా వెల్లడికాలేదు.  
Anushka Shetty
Allu Arjun
Koratala Siva
Sukumar

More Telugu News