IGST: ఐజీఎస్టీ కమిటీలో మార్పులు.. తెలంగాణ మంత్రి హరీశ్ రావుకు చోటు

Telangana minister Harish Rao in GST Committee
  • ఐజీఎస్టీ సమస్యల పరిష్కారం కోసం గతేడాది కమిటీ
  • తాజాగా ఏడుగురితో సరికొత్త కమిటీ
  • సుశీల్ కుమార్ మోదీని కన్వీనర్‌గా నియమించిన జీఎస్టీ మండలి
తెలంగాణ మంత్రి హరీశ్‌రావుకు ఐజీఎస్టీ (సమగ్ర వస్తు, సేవల పన్ను) కమిటీలో చోటు లభించింది. ఐజీఎస్టీ సమస్యల పరిష్కారం కోసం నియమించిన మంత్రుల బృందంలో  మార్పులు చేసిన జీఎస్టీ మండలి ఏడుగురితో కొత్త కమిటీని నియమించింది. ఇందులో మంత్రి హరీశ్‌రావుకు చోటు లభించింది.

తాజా కమిటీకి బీహార్ ఆర్థికమంత్రి సుశీల్ కుమార్ మోదీ కన్వీనర్‌గా నియమితులయ్యారు. కాగా, ఐజీఎస్టీ సమస్యల పరిష్కారం, సంబంధిత అంశాలపై గతేడాది డిసెంబరులో కమిటీ ఏర్పాటు కాగా, ఇప్పుడు దానిలో మార్పులు చేసినట్టు జీఎస్టీ కార్యాలయం తెలిపింది.
IGST
GST
Telangana
Harish Rao

More Telugu News