T20 World Cup: భారత్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు: ఐసీసీపై మండిపడ్డ పాక్ మాజీ క్రికెటర్లు

  • టీ20 ప్రపంచకప్ ను వాయిదా వేసిన ఐసీసీ
  • ఐపీఎల్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్న బీసీసీఐ
  • ఇది ముందే ఊహించామన్న అఖ్తర్, రషీద్
ICC acted in favour of BCCI says Shoib Akhtar

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అఖ్తర్, రషీద్ తీవ్ర ఆరోపణలు చేశారు. టీ20 ప్రపంచకప్ ను ఐసీసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ మాట్లాడుతూ, ఐపీఎల్ నిర్వహణకు అనుగుణంగానే ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. ఇలా జరుగుతుందనే విషయాన్ని తాము ముందే ఊహించామని చెప్పారు.

ఈ ఏడాది జరగాల్సిన టీ20 ప్రపంచకప్ ను వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నట్టు ఐసీసీ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇండియాలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో... యూఏఈలో ఐపీఎల్ ను నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఒకవైపు టీ20 ప్రపంచకప్ వాయిదా పడటం, మరోవైపు ఐపీఎల్ లో పాక్ ఆటగాళ్లను భారత్ అనుమతించకపోవడంతో పాక్ బోర్డు, ఆ దేశ ఆటగాళ్లు ఆర్థికంగా నష్టపోతున్నారు.

More Telugu News