USA: కరోనా రూల్స్ మార్చేసిన అమెరికా... ఐసొలేషన్ ఇకపై 10 రోజులు మాత్రమే!

Only 10 Days Isolation is Enough says us CDC
  • ఇప్పటివరకూ 14 రోజుల ఐసొలేషన్
  • చాలా కొద్దిమందికి మాత్రమే తీవ్ర అస్వస్థత
  • వెల్లడించిన సీడీసీ

కరోనా మహమ్మారి సోకితే ఇప్పటివరకూ పాటించాల్సిన 14 రోజుల ఐసొలేషన్ ను 10 రోజులకు కుదిస్తూ, యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిబంధనలను మార్చింది. ఈ సంవత్సరం మార్చి నుంచి అమెరికాను వైరస్ గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఇక కరోనా పాజిటివ్ వచ్చి, ఎటువంటి లక్షణాలూ లేని వారు ఎప్పుడు బయటకు వెళతామా అని క్షణాలు లెక్కపెట్టుకుంటూ వుంటున్నారు.  

ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిపై పరిశోధనల తరువాత వచ్చిన నివేదికలను పరిశీలించిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ కొన్ని సిఫార్సులు చేసింది. కరోనా లక్షణాలు కనిపించిన, జ్వరం బయటపడిన 24 గంటలలోపు నుంచి 10 రోజుల పాటు రోగులు ఐసోలేషన్ అయితే సరిపోతుందని పేర్కొంది. ఇప్పటివరకూ రెండు సార్లు నమూనాలు ఇచ్చి, అవి నెగటివ్ వస్తేనే ఐసొలేషన్ నుంచి బయటకు రావాలన్న నిబంధన అమలవుతూ వచ్చింది.

ఇక గడచిన ఆరు నెలల వ్యవధిలో వచ్చిన నివేదికల్లో వైరస్ బారిన పడిన వారు, చాలా కొద్ది సమయం మాత్రమే ఇన్ఫెక్ట్ అయ్యారని, వారు చాలా తక్కువ రోజుల్లోనే కోలుకున్నారని, నాలుగు నుంచి 9 రోజుల వ్యవధిలోనే అత్యధికులు కోలుకున్నారని పరిశోధకులు పేర్కొన్నారు. కొద్దిమందికి మాత్రమే ఆసుపత్రి అవసరం అవుతోందని, అతి కొద్దిమంది మాత్రమే తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నారని వీరి అధ్యయనంలో తేలింది. చాలా కొద్దిమందికే 20 రోజుల ఐసోలేషన్ సమయం అవసరమవుతోందని వెల్లడించింది.

  • Loading...

More Telugu News