చీరకట్టులో మైమరపిస్తున్న నటి ప్రీతా హరి... వీడియో ఇదిగో!

22-07-2020 Wed 09:46
  • తెలుగులో రుక్మిణి చిత్రంలో నటించిన ప్రీతా
  • 2002లోనే వివాహం
  • ముగ్గురు బిడ్డలకు తల్లిగా ప్రస్తుతం ప్రీతా
Actress Preetha Hari in Sarry Pics Viral

టాలీవుడ్ నటి, 'రుక్మిణి' ఫేమ్ ప్రీతా హరి చీర కట్టులో మెరిసిన చిత్రాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సీనియర్ నటీ, నటులు విజయ్ కుమార్, మంజుల దంపతుల కుమార్తె అయిన ప్రీతా హరికి 2002లో వివాహం జరుగగా, ముగ్గురు పిల్లలు కూడా వున్నారు. తెలుగులో తన తొలి చిత్రంగా 'రుక్మిణి', 'వైఫ్', 'మా అన్నయ్య', 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', 'ప్రియమైన నీకు' తదితర చిత్రాల్లో నటించిన ప్రీతా తమిళం, మలయాళం చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ప్రీతా ఎంతో అందంగా కనిపిస్తున్న చీరకట్టు చిత్రాలను మీరూ చూడండి.