తిరుపతిలో కరోనా స్వైరవిహారం.. కట్టడి చర్యలు ముమ్మరం

22-07-2020 Wed 08:12
  • ఒక్కరోజులో 493 కేసులు
  • రూరల్ పరిధిలోనే అత్యధిక,
  • తిరుచానూరులో 87 కేసులు
Corona Pandamic in Tirupati

ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతిలో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తోంది. నిన్న ఒక్కరోజులోనే పట్టణంలో కొత్తగా 493 కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికం భక్తులు అధికంగా సందర్శించే తిరుచానూరు, పద్మావతి పురం, అవిలాల ప్రాంతాల్లో నమోదు కావడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. కొత్త కేసులన్నీ, పంచాయతీల పరిధిలోనే రావడం గమనార్హం.

తాజా కేసుల్లో  శెట్టిపల్లిలో 88, తిరుచానూరులో 87, అవిలాలలో 55, పద్మావతిపురంలో 40 కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. తిరుపతి పరిధిలోని నాలుగు పంచాయతీల్లో కొత్త కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో అధికార యంత్రాంగం వైరస్ కట్టడి చర్యలను ముమ్మరం చేసింది.