Gautam Gambhir: కేజ్రీవాల్‌పై మరోమారు విరుచుకుపడిన గౌతం గంభీర్

Gautham Gambhir Fires on Delhi CM Arvind Kejriwal
  • గంభీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొవిడ్ కేంద్రం
  • ఈ నెల 7న ప్రభుత్వానికి అప్పగింత
  • ఇప్పటికీ మూసి ఉండడంతో ఆగ్రహం
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై బీజేపీ ఎంపీ గౌతం గంభీర్ మరోమారు విరుచుకుపడ్డారు. కరోనా విజృంభిస్తున్న వేళ ఢిల్లీలో ఒక్క ఐసోలేషన్ సెంటర్ కూడా పనిచేయడం లేదని విమర్శించారు. టీవీలో కనిపించేందుకు ఉన్న ఆరాటం పనిచేయడంలో లేదని మండిపడ్డారు. వీడియో కాన్ఫరెన్స్‌లో హామీ ఇచ్చినప్పటికీ కాంతినగర్‌లోని జీజీఎఫ్ కోవిడ్ కేంద్రం ఇప్పటికీ తెరుచుకోలేదని, వెంటనే దానిని ప్రారంభించాలని డిమాండ్ చేసిన గంభీర్ మూసివున్న కొవిడ్ కేంద్రం ఫొటోను షేర్ చేశారు.

నిజానికీ కేంద్రాన్ని గంభీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూపొందించి ఈ నెల 7న ప్రభుత్వానికి అందించారు. ఇందులో 50 పడకలు, 30 ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నాయి. ఇంట్లో ఐసోలేషన్‌లో ఉండే అవకాశం లేనివారి కోసం దీనిని ఏర్పాటు చేశారు. అయితే, ఇది ఇంకా మూసివేసే ఉండడంతో గంభీర్ ఇలా కేజ్రీవాల్‌పై విమర్శలతో విరుచుకుపడ్డారు.
Gautam Gambhir
Arvind Kejriwal
COVID-19
Isolation Centre

More Telugu News