బిగ్ బాస్-4లో తాను పాల్గొంటున్నట్టు వస్తున్న వార్తలపై తరుణ్ స్పందన

21-07-2020 Tue 20:03
  • త్వరలో బిగ్ బాస్ నాలుగో సీజన్
  • హీరో తరుణ్ కూడా పాల్గొంటున్నట్టు ప్రచారం
  • ఊహాగానాలకు తెరదించిన తరుణ్
Hero Tarun clarifies ongoing rumors that he would participate in Bigg Boss

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన కార్యక్రమం బిగ్ బాస్ నాలుగో సీజన్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ అతిపెద్ద రియాల్టీ షోను ప్రసారం చేసే స్టార్ మా చానల్ నిన్ననే ప్రోమో రిలీజ్ చేసింది. అయితే, చాలారోజులుగా బిగ్ బాస్-4లో పాల్గొనేది వీళ్లేనంటూ కొందరు సెలబ్రిటీల పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. వాళ్లలో హీరో తరుణ్ పేరు కూడా ఉంది.

దీనిపై తరుణ్ స్పందించడమే కాదు, ఊహాగానాలకు తెరదించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. సోషల్ మీడియాలోనూ, కొన్ని దినపత్రికల్లోనూ తన గురించి ప్రచారం జరుగుతోందని, తాను బిగ్ బాస్ లో పాల్గొంటున్నట్టు వస్తున్న కథనాల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

 "నేను ఈ రియాల్టీ షోలో చేయడం లేదు. నాకు దీనిపై ఏమంత ఆసక్తి కూడా లేదు. ఊహాగానాలను ఎవరూ నమ్మవద్దు. అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు, కరోనా కాలంలో ఇంటిపట్టునే క్షేమంగా ఉండండి" అంటూ పేర్కొన్నారు.