దళిత యువకుడికి గుండు కొట్టించిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి: హర్షకుమార్

21-07-2020 Tue 18:10
  • సీతానగరం పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు
  • పోలీస్ స్టేషన్ లోనే గుండు కొట్టించారు
  • ఎస్పీ, డీఎస్పీ, సీఐలను సస్పెండ్ చేయాలి
Take against police who shaved head of dalit man demands Harsha Kumar

దళిత యువకుడిపై తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీసులు అమానుషంగా ప్రవర్తంచారని మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ లోనే గుండు కొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఎస్పీ, డీఎస్పీ, సీఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ నేత కృష్ణమూర్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లో చర్యలు తీసుకోవాలని... లేనిపక్షంలో ఏం చేస్తామో చేసి చూపిస్తామని హెచ్చరించారు.