Arogyasri: ఆరోగ్యశ్రీ కార్డుల పేరిట మోసాలు చేస్తారు... జాగ్రత్తగా ఉండాలి: ఏపీ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓ

Arogya Sri trust CEO says beware of cheaters
  • ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డుల మంజూరు
  • డబ్బులు వస్తాయంటూ టోకరా వేస్తారన్న ఆరోగ్య శ్రీ సీఈఓ
  • బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పవద్దని సూచన
ఏపీలో ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసిన నేపథ్యంలో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టు సీఈఓ డాక్టర్ మల్లికార్జున్ హెచ్చరికలు చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల పేరిట మోసాలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ప్రభుత్వం మీ ఖాతాలో డబ్బులు డిపాజిట్ చేస్తుందని కొందరు ఫోన్ చేసి బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్ నెంబరు, ఓటీపీ అడుగుతారని, అలాంటి వారికి వివరాలు చెబితే మోసపోయే ప్రమాదం ఉంటుందని వివరించారు. అందుకే అలాంటి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఇలాంటివే కొన్ని ఆడియో క్లిప్పింగులు సోషల్ మీడియాలో కూడా దర్శనమిస్తున్నాయని, వాటితో ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టుకు ఎలాంటి సంబంధంలేదని డాక్టర్ మల్లికార్జున్ స్పష్టం చేశారు.
Arogyasri
CEO
Mallikarjun
Cheating
Andhra Pradesh

More Telugu News