మంత్రి పదవి ఊహించలేదు.. జగన్ గారికి ధన్యవాదాలు: అప్పలరాజు

21-07-2020 Tue 16:50
  • నాపై నమ్మకం ఉంచినందుకు సీఎంకు ధన్యవాదాలు
  • నా బాధ్యత మరింత పెరిగింది
  • జగన్ ఆశయాలకు అనుగుణంగా పని చేస్తా
I never expected minister post says Appalaraju

ఏపీ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు అనూహ్యంగా మంత్రివర్గంలో స్థానాన్ని దక్కించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మాన ప్రసాదరావు, స్పీకర్ తమ్మినేని సీతారాం వంటి సీనియర్లు మంత్రి పదవిని ఆశించినప్పటికీ... డాక్టర్ అప్పలరాజును అదృష్టం వరించింది.

ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి దక్కుతుందని ఊహించలేదని చెప్పారు. తనపై నమ్మకం ఉంచి పదవిని ఇచ్చినందుకు ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. ఇప్పుడు తనపై బాధ్యత మరింత పెరిగిందని చెప్పారు. ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా పని చేస్తానని అన్నారు.