దేవాదాయశాఖ నిధులను అమ్మఒడికి మళ్లించడం దారుణం: జగన్ కు కన్నా లేఖ

21-07-2020 Tue 14:48
  • ఇలాంటి చర్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీస్తాయి
  • దేవాదాయశాఖ నిధులు హిందూ కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలి
  • అమ్మఒడికి మళ్లించిన నిధులను వెనక్కి తెప్పించండి
Diverting endowments funds to Amma Odi scheme is not good says Kanna

అమ్మఒడి పథకాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర బడ్జెట్ లో కేటాయింపులు బాగానే జరిగాయి. అయితే, దేవాదాయశాఖకు చెందిన నిధులను అమ్మఒడి పథకానికి మళ్లించారంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు.

దేవాదాయశాఖ నిధులను కేవలం హిందు ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని అన్నారు. ఇకపై దేవాదాయశాఖ నిధులు ఇతర కార్యక్రమాలకు మళ్లకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అమ్మఒడి పథకానికి మళ్లించిన నిధులను వెంటనే దేవాదాయశాఖ అకౌంట్లో వేయించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు సీఎం జగన్ కు కన్నా లేఖ రాశారు.