Raavi Ravindranath Chowdary: వైఎస్సార్ సన్నిహితుడిగా పేరొందిన మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ చౌదరి కన్నుమూత

Tenali former MLA and YSR best friend Raavi Ravindranath Chiwdary dies of illness
  • అనారోగ్యంతో మృతిచెందిన తెనాలి మాజీ ఎమ్మెల్యే
  • రేపు తెనాలిలో అంత్యక్రియలు
  • వైఎస్ తో కలిసి ఎంబీబీఎస్ చదివిన రవీంద్రనాథ్ చౌదరి
తెనాలి మాజీ ఎమ్మెల్యే రావి రవీంద్రనాథ్ చౌదరి అనారోగ్యంతో మృతి చెందారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రవీంద్రనాథ్ చౌదరి హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

చౌదరి మృతితో తెనాలిలో విషాదఛాయలు అలముకున్నాయి. రేపు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి తెనాలి తరలిస్తున్నారు. రవీంద్రనాథ్ చౌదరి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆప్త మిత్రుడిగా గుర్తింపు పొందారు.  వైఎస్సార్, రవీంద్రనాథ్ చౌదరి ఇద్దరూ డాక్టర్లే. ఒకే కాలేజీలో ఎంబీబీఎస్ చదివారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య స్నేహం ఉంది. కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన రవీంద్రనాథ్ చౌదరి తెనాలి మున్సిపల్ చైర్మన్ గా రెండు సార్లు, తెనాలి ఎమ్మెల్యేగా రెండు సార్లు నెగ్గారు.
Raavi Ravindranath Chowdary
Demise
YSR
MBBS
Tenali
Congress

More Telugu News