ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న రజనీకాంత్ ఫొటో, వీడియో

21-07-2020 Tue 14:35
  • తన కుమార్తె కారును డ్రైవ్ చూస్తూ వెళ్లిన రజనీ
  • ఈ సందర్భంగా మాస్క్ ధరించిన సూపర్ స్టార్
  • క్లిక్ మనిపించిన అభిమానులు
Rajinikanths driving car with a mask

సౌతిండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు సంబంధించిన ఏ వార్త అయినా దేశ వ్యాప్తంగా వైరల్ అవుతుంది. కేవలం దక్షిణాదిలోనే కాకుండా ఉత్తరాదిలో సైతం ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటమే దీనికి కారణం. తాజాగా ఆయనకు సంబంధించిన ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సొంతంగా ఆయనే కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుండగా అది అభిమానుల కళ్లలో పడింది. దీనికి సంబంధించిన ఫొటోను అభిమానులు క్లిక్ మనిపించారు. తన కుమార్తెకు చెందిన అంత్యంత ఖరీదైన లాంబోర్గినీ కారును రజనీ డ్రైవ్ చేస్తూ వెళ్లారు. ఈ సందర్బంగా ఆయన మాస్క్ కూడా ధరించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటో, వీడియో వైరల్ అవుతున్నాయి.