వాల్వ్ ఉన్న ఎన్-95 మాస్కుల వల్ల ఉపయోగం లేదు.. సాధారణ మాస్కులే బెటర్: కేంద్రం

21-07-2020 Tue 08:48
  • అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖలు రాసిన కేంద్రం
  • కోవిడ్ రాకుండా ఇవి అడ్డుకోలేవని స్పష్టీకరణ
  • వాటికంటే ఇంట్లో తయారుచేసిన సాధారణ క్లాత్ మాస్కులే నయమన్న కేంద్రం
Centre warns against usage of N95 masks with valves

మాస్కుల వినియోగంపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. కవాటం ఉన్న ఎన్-95 మాస్కులు వినియోగించవద్దని, ఇవి  వైరస్ వ్యాప్తిని అడ్డుకోలేవని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖలోని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. ఆరోగ్య కార్యకర్తలు కాకుండా ఇతరులు కవాటాలతో ఉన్న ఈ ఎన్-95 మాస్కులను ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడాన్ని తాము గమనించినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చే సమయంలో ఇంట్లో తయారు చేసిన రక్షణ కవచాలను, సాధారణ మాస్కులను వినియోగించేలా ప్రజలను ప్రోత్సహించాలని సూచించారు.