సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

21-07-2020 Tue 07:30
  • ప్రభాస్ సినిమాలో డ్యాన్సర్ గా దీపిక 
  • శర్వానంద్ సరసన 'మజిలీ' భామ
  • వచ్చే నెల నుంచి నాగశౌర్య షూటింగ్
Deepika to play dancer role in Prabhas movie

*  ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించే చిత్రంలో బాలీవుడ్ భామ దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. ఇక ఇందులో ఆమె డ్యాన్సర్ పాత్రలో నటించనున్నట్టు తెలుస్తోంది. కథలో చోటుచేసుకునే అనూహ్యమైన మలుపులకు ఆమె పాత్రే కారణం అవుతుందట.
*  శర్వానంద్ సరసన 'మజిలీ' ఫేం దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటించనుంది. 'ఆర్ ఎక్స్ 100' ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రూపొందే 'మహాసముద్రం' చిత్రంలో దివ్యాంశను హీరోయిన్ గా ఎంచుకుంటున్నారు.
*   నాగశౌర్య హీరోగా ఓ కొత్త సినిమా ప్రారంభం కానుంది. 'సుబ్రమణ్యపురం' ఫేం సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెల నుంచి జరుగుతుంది. గత మార్చిలో సెట్స్ కి వెళ్లాల్సిన ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదాపడింది.