Maharashtra: కళ్లజోళ్ల కోసం న్యాయమూర్తులకు ఏడాదికి రూ. 50 వేలు.. ఉద్ధవ్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

Bombay High Court Judges to get Rs 50 Thousand for spectacles
  • గవర్నమెంట్ రిజల్యూషన్‌ను ఆమోదించిన ప్రభుత్వం
  • న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులకు కూడా
  • రాష్ట్రాల చట్టం, న్యాయవ్యవస్థ జీఆర్ ప్రకారం నిర్ణయం

బాంబే హైకోర్టులోని న్యాయమూర్తుల కళ్లజోళ్ల కోసం నిధులు కేటాయిస్తూ ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టులోని ఒక్కో న్యాయమూర్తికి ఏడాదికి రూ. 50 వేలు చెల్లించేందుకు ఆమోదించిన గవర్నమెంట్ రిజల్యూషన్ (జీఆర్)కు నిన్న ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న్యాయమూర్తులు, వారి జీవిత భాగస్వాములతో పాటు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు కూడా దీని పరిధిలోకి రానున్నారు. అలాగే, ఈ మొత్తంలో పునరావృత ఖర్చులు కూడా ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రాల చట్టం, న్యాయవ్యవస్థ జీఆర్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.

  • Loading...

More Telugu News