LK Advani: ‘బాబ్రీ’ కేసులో అద్వానీ, మురళీ మనోహర్ జోషి వాంగ్మూలాలను నమోదు చేయనున్న సీబీఐ ప్రత్యేక కోర్టు

  • 23న జోషి, 24న అద్వానీ వాంగ్మూలాల నమోదు
  • ఆగస్టు 31లోగా బాబ్రీ కేసులో తీర్పు ఇవ్వాలంటూ గతంలో సుప్రీం ఆదేశం
  • మొత్తం 32 మంది నిందితుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్న ప్రత్యేక న్యాయస్థానం
CBI Special Court to Record Advani and Joshi Statements

అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన కేసులో నిందితులైన బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని అయిన ఎల్‌కే అద్వానీతోపాటు, ఆ పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి వాంగ్మూలాలను సీబీఐ ప్రత్యేక కోర్టు నమోదు చేయనుంది. 23న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జోషి వాంగ్మూలాన్ని నమోదు చేయనుండగా, 24న అద్వానీ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బాబ్రీ కూల్చివేత కేసులో ఆగస్టు 31లోగా తీర్పు ఇవ్వాల్సిందిగా ప్రత్యేక కోర్టును సుప్రీంకోర్టు గతంలో ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న 32 మంది వాంగ్మూలాలను కోర్టు నమోదు చేస్తోంది.

More Telugu News