Andhra Pradesh:  ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంపు!

  • లీటర్ పెట్రోల్ పై రూ. 1.24... లీటర్ డీజిల్ పై 0.93 పైసలు పెంపు
  • ఆదాయం దారుణంగా పడిపోయిందన్న రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ
  • ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే వ్యాట్ పెంచామని వివరణ
AP Govt hikes VAT on petrol and diesel

అసలే కరోనా మహమ్మారితో బెంబేలెత్తిపోతున్న రాష్ట్ర ప్రజలకు వైసీపీ ప్రభుత్వం షాకిచ్చింది. పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ ట్యాక్సును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. లీటర్ పెట్రోల్ పై రూ. 1.24... లీటర్ డీజిల్ పై 0.93 పైసలు పెంచింది. లాక్ డౌన్ వల్ల ప్రభుత్వ ఆదాయం భారీగా పడిపోయిందని ఈ సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ భార్గవ తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ నెలలో రూ. 4,480 కోట్లుగా ఉన్న ఆదాయం...  ఈ నెలలో 29.5 శాతానికి తగ్గి రూ. 1,323 కోట్లకు పడిపోయిందని చెప్పారు. గత నెలలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని తెలిపారు. రెవెన్యూ పడిపోవడం వల్లే ఆదాయం కోసం పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పెంచామని చెప్పారు.

More Telugu News