అల్లు అర్జున్ 'బుట్టబొమ్మ' పాటకు స్టెప్పులేసిన ఇండిగో సిబ్బంది

20-07-2020 Mon 15:56
  • సూపర్ హిట్టయిన బుట్టబొమ్మ పాట
  • వైజాగ్ ఎయిర్ పోర్టులో ఇండిగో స్టాఫ్ డ్యాన్సులు
  • సోషల్ మీడియాలో సందడి చేస్తున్న వీడియో
Indigo staff dances for Allu Arjun song Butta Bomma in Vizag airport

అల్లు అర్జున్ హీరోగా నటించిన 'అల.. వైకుంఠపురములో' సినిమాలోని 'బుట్టబొమ్మ' పాట ఎంతటి ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, వైజాగ్ లోని ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిని కూడా ఆ పాట విశేషంగా ఆకర్షించింది. ఎయిర్ పోర్టులో 'బుట్టబొమ్మ' పాట వస్తుండగా, ఇండిగో సిబ్బంది డ్యాన్స్ చేశారు. మాస్కులు, హ్యాండ్ గ్లోవ్స్ ధరించిన ఎయిర్ హోస్టెస్ లు, పైలెట్లు ఫ్లాష్ మాబ్ డ్యాన్స్ తరహాలో బన్నీ పాటకు స్టెప్పులేసి అందరినీ అలరించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.