సీనియర్ హీరో అర్జున్ కుటుంబంలో కరోనా కలకలం... కుమార్తెకు పాజిటివ్

20-07-2020 Mon 15:19
  • ఐశ్వర్య అర్జున్ కు కరోనా పాజిటివ్
  • తనను కలిసిన వాళ్లు జాగ్రత్తగా ఉండాలన్న ఐశ్వర్య
  • త్వరలో మీ ముందుకు వస్తానంటూ ప్రకటన
Aishwarya Arjun tested corona positive

సీనియర్ హీరో అర్జున్ కుమార్తె ఐశ్వర్య కరోనా బారినపడ్డారు. ఇటీవలే తనకు కరోనా టెస్టులు నిర్వహించగా, పాజటివ్ అని ఫలితం వచ్చిందని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నానని, నిపుణులైన వైద్యబృందం అందిస్తున్న సూచనలు పాటిస్తున్నానని తెలిపారు. గత కొన్నిరోజుల కిందట తనను ఎవరైనా కలిసి ఉంటే వారు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ దయచేసి మాస్కు ధరించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే కోలుకుని మీ ముందుకు వస్తానని ఐశ్వర్య ఓ ప్రకటన వెలువరించారు.