Ram Kumar Yarlagadda: విజయసాయిరెడ్డీ... మా పార్టీలోని నీ కోవర్టు నీకు తప్పుడు సమాచారం ఇచ్చాడు: బీజేపీ నేత రామ్ కుమార్ యార్లగడ్డ

Vijayasai Reddy your man from my party made you fool says Ram Kumar Yarlagadda

  • కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్ట్ అన్న విజయసాయి
  • విజయసాయిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ నేతలు
  • రిప్లై ఫ్రమ్ సెంట్రల్ పార్టీ అంటూ వ్యాఖ్య 

ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్ట్ అంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. సొంత పార్టీ అభిప్రాయానికి భిన్నంగా, చంద్రబాబుకు అనుకూలంగా రాజధాని బిల్లును ఆమోదించవద్దని గవర్నర్ కు లేఖ రాశారని ఆయన ట్వీట్ చేశారు. దీంతో బీజేపీ అధిష్ఠానం ఆగ్రహానికి కూడా గురయ్యాడని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

విజయసాయి వ్యాఖ్యలపై బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు రామ్ కుమార్ యార్లగడ్డ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. 'విజయసాయిరెడ్డీ... మా పార్టీలో ఉన్న నీ కోవర్టు ఎవడో కానీ తప్పుడు సమాచారమిచ్చి నిన్ను ఎర్రిపప్పను చేశాడు' అని ట్వీట్ చేశారు. 'రిప్లై ఫ్రమ్ సెంట్రల్ పార్టీ' అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News