America: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. రద్దీ రోడ్డుపై ముగ్గురు ఆఫ్రో అమెరికన్ల కాల్పులు

Police look for 3 suspects after 9 people shot in US
  • వాషింగ్టన్ జిల్లా వాయవ్య  ప్రాంతంలో కాల్పులు
  • సెకన్లలోనే కాల్పులు జరిపి పరారైన దుండగులు
  • ఒకరి మృతి.. మరో నలుగురి పరిస్థితి విషమం
అమెరికాలో మరోమారు కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్ జిల్లా వాయవ్య ప్రాంతంలోని 14వ వీధి స్ప్రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డుపై నిన్న సాయంత్రం దాదాపు 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

కాల్పులు జరిపిన ముగ్గురు ఆఫ్రో అమెరికన్లని మెట్రోపాలిటన్‌ పోలీసు చీఫ్‌ పీటర్‌ న్యూషామ్‌ తెలిపారు. వీరిలో ఇద్దరు పెద్ద తుపాకులతో కాల్పులు జరపగా, మరొకరు పిస్టల్‌తో కాల్చినట్టు వివరించారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాల సాయంతో దుండగుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, మొత్తం పది సెకన్లలో అంతా అయిపోయిందని, టపాసులు కాల్చిన శబ్దం వచ్చిందని అధికారులు తెలిపారు.
America
Washington
Northwest DC
Gun shooting

More Telugu News