UAE: అంగారక యాత్రలో యూఏఈ తొలి అడుగు.. విజయవంతంగా ‘హోప్’ మిషన్ ప్రయోగం!

  • జపాన్‌లోని తనెగాషిమా స్పేస్ సెంటర్ నుంచి ఈ రోజు ప్రయోగం
  • 200 రోజులపాటు సాగనున్న యాత్రం
  • 687 రోజులపాటు అధ్యయనం
United Arab Emirates successfully launches its first spacecraft

అంగారక గ్రహ యాత్ర దిశగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) వేసిన తొలి అడుగు ఈ రోజు విజయవంతంగా ముందుకు పడింది. ఎమిరేట్స్ మార్స్ మిషన్‌కు చెందిన హోప్ అంతరిక్ష నౌకను హెచ్-11ఏ వాహక నౌక నింగిలోకి మోసుకెళ్లింది. జపాన్‌లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి దీనిని ప్రయోగించారు. నిజానికి ప్రయోగం గత బుధవారమే జరగాల్సి ఉండగా, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.

అంగారక గ్రహం మీద వాతావరణ పరిస్థితుల అధ్యయనమే లక్ష్యంగా చేపట్టిన ఈ మిషన్‌లో 200 రోజుల (దాదాపు ఏడు నెలలు) పాటు యాత్ర సాగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అంగారక కక్ష్యలోకి చేరు కోనుంది. ఆ తర్వాత 687 రోజులపాటు అధ్యయనం కొనసాగుతుందని యూఏఈ స్పేస్ సెంటర్ తెలిపింది. రోజువారీ వాతావరణం, రుతువులు, ఉపరితలంలో గూడుకట్టుకుని ఉన్న ధూళి కణాల లక్షణాలను ఇది పరిశీలిస్తుంది. అమెరికా అంతరిక్ష నిపుణుల వద్ద శిక్షణ పొందిన యూఏఈ ఇంజినీర్లు ఆరేళ్ల కాలంలోనే ‘హోప్’ మిషన్‌ను పూర్తి చేశారు.

More Telugu News